పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులకు మంచి మార్కులు సాధించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్ష ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఇలాంటి పరీక్ష నిర్వహిస్తున్నాము అని అన్నారు అదేవిధంగా అదేవిధంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు ఇలాంటి పోటీ పరీక్షల విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొని ఉన్నత స్థానాలలో ఉండాలని వారు కోరారు అదేవిధంగా ప్రతి విద్యార్థి వచ్చే పబ్లిక్ పరీక్షలలో అందరూ 10/10 GPA తెచ్చుకోవాలని తన మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు 25 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిభ పరీక్షకు ఐఐటి చుక్క రామయ్య అధ్యక్షతన జరుగుతుందని వారు తెలిపారు పబ్లిక్ పరీక్షలలో భూపాలపల్లి విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మండలానికి జిల్లాకు స్కూళ్లకు గొప్ప పేరు తీసుకురావాలని వారు కోరారు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం ద్వారా పబ్లిక్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు వారు భయాందోళనలకు గురికాకుండా పబ్లిక్ పాఠశాలలకు సిద్ధమవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ యొక్క పరీక్షలను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ 1970లో ఏర్పడినప్పటి నుండి విద్యారంగం సమస్యల పైన పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐదే అని వారు కొనియాడారు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఐదు నుంచి 6 సెంటర్లలో విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ టెన్త్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా యొక్క టెన్త్ టాలెంట్ టెస్ట్ కు సహకరించిన పాఠశాల యజమాన్యాలకు ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవ వందనాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు స్వామి ఆది గాంధీ జిల్లా ఉపాధ్యక్షులు గోమాస నరేష్ తదితరులు పాల్గొన్నారు