
Class and social struggles
వర్గ సామాజిక జమిలి పోరాటాలే సమస్యలకు పరిష్కారం
ఓంకార్ అనుసరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరం
శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంసిపిఐ(యు) నేతలు
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,
నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే పరిష్కారం చూపుతాయని ఈ క్రమంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆచరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోనె కుమారస్వామి, హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ ప్రచార వాల్ పోస్టర్లను పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక అంతరాలు పెరిగిపోయి నూటికి 70 శాతం మంది ఎంత శ్రమపడిన కనీస అవసరాలు తీరలేని స్థితికి నెట్టి వేయబడుతున్నారని పాలకుల దోపిడీ విధానాలు కార్పొరే ట్ పెట్టుబడుదారి శక్తుల దోచుకునే పద్ధతులు రోజురోజుకీ విస్తృతం అవుతున్నాయని మరోవైపు కులం మతం ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వైశాల్యాలను సృష్టిస్తున్నారని మభ్యపెట్టే హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని అందరికీ సమానంగా దక్కాల్సిన సంపద కొద్దిమందికే చెందుతున్నదని ఇలాంటి పరిస్థితులలో ఆదర్శవంతమైన రాజకీయాలు శ్రమజీవుల కోసం పాటుపడే నేతలు మార్క్సిజం లెనినిజం పునాదుల మీద మరింత శక్తిని కూడగట్టుకుని పనిచేయాలని అందుకు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆశయాలను ఆచరణను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అందులో భాగంగా కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవం సందర్భంగా మే 12న మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభ సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు కమ్యూనిస్టు వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు కవులు కళాకారులు హాజరవుతారని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంద రవి, కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు నర్ర ప్రతాప్, రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, కుసుంబ బాబూరావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా నాయకులు ఐతం నాగేష్, ఎగ్గని మల్లికార్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు.