VOICE
మంచు కుటుంబంలో మొదలైన తుపాను సునామీగా మారింది. మంగళవారం రాత్రి వరకు మోహన్ బాబు వర్శెస్ మనోజ్ అన్నట్టు సాగిన వివాదం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. మీడియా ప్రతినిధులపై దాడితో మోహన్ బాబు వర్శెస్ మీడియాగా పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఉన్న వివాదంపై ప్రశ్నించిన మీడియాపైనే దాడికి మోహన్ బాబు తెగబడటంతో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఒకే రోజులు రెండు సార్లు మీడియా ప్రతినిధులపై దాడుల చేశారని మాట వినిపిస్తోంది.
మోహన్ బాబు ప్రవర్తను మీడియా సంఘాలు, రాజకీయ నాయకులు ఖండించారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనపై కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు రిజిస్టర్ చేశారు. అంతే కాకుండా ఆయనకు కేటాయించిన బౌన్సర్లను బైండోవర్ చేయనున్నారు. గన్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. దాడి ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖండించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. గాయపడిన జర్నలిస్ట్‌కు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు దంపతులు ఆసుపత్రి పాలైనట్ట వార్తలు వస్తున్నాయి. గొడవలతో కలత చెందిన మనోజ్ తల్లి సాయంత్రమే అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు చెబుతున్నారు. మరో వైపు తన నివాసంలో మనోజ్ చేసిన హంగామా, మీడియా ప్రతినిధులపై దాడి అనంతరం మోహన్ బాబు కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇద్దర్నీ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా మోహన్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదని సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.