*ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి..
*టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం..
తిరుపతి( నేటి ధాత్రి)మార్చి 27:
యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు, గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టిడిపి బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం కు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం,నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టు శాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు
హాజరు కావాలని
బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్ కు రావడం మనకందరికీ ఆనందంగా ఉందని కనుక తిరుపతి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు, తిరుపతి నుండి భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద
ఎత్తున తరలిరావాలని టిడిపి నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .జగన్నాథం
పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం, తిరుపతిలో కుల సంఘాల నాయకులు వడ్డెర సంఘం నాయకులు బాలాజీ,
కరాటే చంద్ర , అక్కినపల్లి లక్ష్మయ్య , ఆముదాల తులసీదాస్ , శంకరయ్య , భక్తవత్సలం , అశోక్
తదితరులు పాల్గొన్నారు..