పలిమల మహా ముత్తారంలో సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా పరిధిలోని పలిమెల, మహా ముత్తారాం మండలాల్లో ఈ నెల 8 నుండి 15వ తేది వరకు సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పర్యతించనున్నందున అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్సోరి నుండి మొత్తం 12 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని, పలిమెల, మహా ముత్తారం మండలాల్లో వసతి, భోజన సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఉంటుందని సంబంధిత శాఖలు విభాగాలవారీగా నోట్స్ సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ విజిట్ అనంతరం అధికారులు పర్యటనపై ఫీడ్ బ్యాక్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కోసం నివేదికలను తయారుచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు
