
పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ్యుల ఉత్సాహం మధ్యన అధ్యక్షుడు బియాంకర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం చాలా అత్యున్నత దేశమని స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పౌర సంక్షేమ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని దానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ విభాగాలలో విద్య వైద్యం మహిళా అభివృద్ధికి కృషి జరపవలసి ఉన్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో
బియ్యంకార్ శ్రీనివాస్,అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిప్ప దేవదాసు, కోశాధికారి మరియు సభ్యులు వేముల పోశెట్టి,శివశంకర్,కోడం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.