
CityNet Support for AP Smart Cities
ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం
ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ (Minister Narayana) పర్యటన కొనసాగుతోంది. స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో మంత్రి పర్యటిస్తున్నారు. నాలుగవ రోజు పర్యటనలో భాగంగా సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్ పో 2025ను మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఆర్గనైజేషన్, సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఎక్స్ పోను మంత్రి సందర్శించారు.
ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ నెట్ సీఈవో చాంగ్ జే బక్ (chang jae – bok)తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సుస్థిరమైన పట్టణాభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిటీ నెట్ పనిచేస్తోంది. ఈ క్రమంలో పర్యావరణహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధి విషయంలో ఏపీకి సహకరించాలని ఈ సందర్భంగా సిటీ నెట్ నిర్ణయించింది.