
Devotees danced
అంగరంగ వైభవంగా నగర సంకీర్తన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 158వ నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన నగర సంకీర్తన నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ లింగేశ్వర మందిరం వరకు కొనసాగింది. శ్రీ కృష్ణ కీర్తనలు, శ్రీ రామ భజనలు, శ్రీ శివ స్తోత్రాలను ఆలపిస్తూ భక్తులు ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.