ఆశాలకు ఫిక్స్ డు వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి సీఐటీయూ డిమాండ్

ములుగు టౌన్ నేటి ధాత్రి

మలుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసి ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే లకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ, పి, ఆర్ మంత్రి సీతక్క కు వినతిపత్రం క్యాంపు ఆఫీస్ లో మంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతు ఆశా వర్కర్స్ గతంలో 15 రోజులు సమ్మె పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టిన హామీలు, కమీషనర్ గారితో జరిగిన చర్చల హామీలు వెంటనే అమలుకు పూనుకోవాలని అన్నారు. కమిషనర్ హామీ అయినా రికార్డు లు వెంటనే ఇవ్వాలని,50 లక్షలు ప్రమాదం భీమా, మట్టి ఖర్చులు యాభై వేల రూపాయలు ఇస్తామని కమీషనర్ హామీ కూడా నేటికీ సర్క్యూలర్ ఇవ్వలేదు అన్నారు. వెంటనే సర్క్యూలర్ ఇవ్వాలని అన్నారు.
గతం లో మాదిరిగా ప్రతి నెల రెండవ తేదీన వేతనాలు ఇవ్వాలని అన్నారు.పి ఎఫ్, ఈ ఎస్ ఐ, సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని అన్నారు. ఆశలకు ఏ ఎన్ ఏం గా ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ నీలాదేవి, ఉపాధ్యక్షరాలు చుంచు మంజుల శోభ కవిత దేవేంద్ర సుధారాణి సరిత రజితఅరుణపార్వతి సవిత అనిత సంధ్య భారతి నాగమణి,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *