CIE Organization Distributes Free Shuttles to Burdipad School Students
బూర్దిపాడ్ పాఠశాలకు సీఐఇ సంస్థ షట్టర్ల పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూర్దిపాడ్ గ్రామ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం సాయంత్రం సీఐఇ సంస్థ ప్రతినిధులు ఉచితంగా షట్టర్లను పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆశయంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రుతకు మంచి పేరును తీసుకు రావాలని వారు సూచించారు. ఇటి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌతం కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సర్దార్ జీ, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
