శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులకు ఇబ్బందికరం.ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలుకనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వేగం అదుపు చేయలేక పోవడం వల్ల వాహనదారులు మలుపులు గమనించకుండా వేగంగా వచ్చి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతున్నారు..వాహనదారులు శాయంపేట నుండి కొత్తగట్టు సింగారం వైపు వెళ్లే రోడ్డు దారిలో ఇరువైపులా ముళ్లపొదలు ఉండి మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాటిని గుర్తించి సిఐ మరియు ఎస్ఐ జెసిబి సహయంతో ముళ్ళపొదలను తొలగించారు .