
మొక్కల సంరక్షణకు పాటుపడాలి సిఐ నరేష్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలు పోలీస్ సిబ్బందితో కలిసి వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.