నడికూడ,నేటిధాత్రి:
స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్
ఈరోజు నడికూడ మండల లోని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ముఖ్య నాయకుల కమిటీ జిల్లా కార్యదర్శి కోడెపాక భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి మాదిగ జర్నలిస్టు ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఏ పార్టీకి అనుబంధం కాదని స్వాతంత్ర్య ప్రాతిపత్తి కలిగిన సంఘమని ఇది మాదిగ మాదిగ ఉపకులాల జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతుందని అన్నారు అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్ట్ బందు పేరుతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సంఘం డిమాండ్ చేస్తుంది.అలాగే అర్హులైన మాదిగ మాదిగ ఉపకులాల జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది.అలాగే చిన్న పెద్ద పత్రికల తేడా లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టులు పాల్గొన్నారు.