ఉద్యమాల జర్నలిస్ట్ కు గొప్ప గుర్తింపు!!!
జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి “సేవా రత్న” నేషనల్ అవార్డు – 2024 ను అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఫిబ్రవరి 11 ఆదివారం సాయంత్రం జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 7వ నేషనల్ కాన్సరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డా,యు.సుబ్రమనియన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్ ల చేతుల మీదుగా చుక్క గంగారెడ్డి కి “సేవారత్న నేషనల్ అవార్డు” ను అందజేశారు.ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ చుక్క గంగారెడ్డి ఉద్యమాల చరిత్రను, సమాజానికి ఆయన చేసిన సేవలను, జర్నలిస్ట్ గా రచించిన వార్తాంశాలను కొనియాడారు. రక్తదానం, విద్యా దానం, సేవా దానంలతో పాటు ఆర్టీఐ కార్యకర్తగా, హక్కుల కార్యకర్తగా, అవినీతి – అక్రమాల, దోపిడీల నిర్మూలన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చుక్క గంగారెడ్డి చేసిన పోరాటాలను, ఇతరత్రా సేవలను గుర్తించి ఈ అవార్డ్ ప్రదానం చేయడం జరిగిందన్నారు.జాతీయ అవార్డ్ సెలక్షన్ కమిటీ సభ్యులు తాల్లపల్లి సురేందర్ గౌడ్ సూచనలతో, బి.ఎస్.ఎ. రాష్ట్ర అధ్యక్షులు, అవార్డుల సెలక్షన్ కమిటీ సభ్యులైన
యం.యం.గౌతమ్ ల,ప్రతిపాదనల మేరకు వాస్తవాలను, ఆధారాలను పరిశీలించి చుక్క గంగారెడ్డి కి ఈ అవార్డ్ ప్రధానం చేయడం జరిగిందని నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నల్లా రాధా కృష్ణ వివరించారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటిల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, కవులకు, రచయితలకు, స్వచ్చంద సంస్థలకు ఇలాంటి అవార్డులను అందజేస్తున్నట్లు నల్లా రాధా కృష్ణ తెలియ జేశారు. సౌత్ ఇండియాలోని 6 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్ర, అస్సాం, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి సుమారుగా 600 మందికి పైగా డెలిగెట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరైనారని ఆయన తెలియజేశారు.,ప్రముఖ సినీ, గేయ రచయిత, ప్రజా కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్, బహుజన సాహిత్య అకాడమీ సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరి జి.విష్ణువర్థన్, కమిటి సభ్యులు యం.యం. గౌతమ్, బాదె వెంకటేశం, తాటికంటి అయిలయ్య, వంగ కుమారస్వామి, వై.రవీంద్రప్రసాద్, ముక్కెర సంపత్ కుమార్ తదతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు రాధాకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు.
“సేవా రత్న” నేషనల్ అవార్డు అందుకున్న “చుక్క గంగారెడ్డి”!!!
