
Chudamani Gyan Yajna under the auspices of Geeta Prachara Seva Samiti
గీతా ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో చూడామణి జ్ఞాన యజ్ఞం
సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్ లో
శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం లో(వివేక చూడామణిపై జ్ఞాన యజ్ఞము) తేది 20-03-2025 నుండి 24-03-2025 వరకు ఐదు రోజులు సిరిసిల్లలో నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈరోజు గీతా ప్రచార సేవాసమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య చిన్మయ మిషన్,బి.వై నగర్ హనుమాన్ పరివార్ అధ్యక్షులు మోతిలాల్ నల్ల శ్రీనివాస్ హనుమాన్ పరివార్ అధ్యక్షులు మరియు బూర సారంగం, మెరుగు మల్లేశం,రాపెళ్లి లత, మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు. అంతేకాకుండా యజ్ఞానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించడం జరిగినది.