* హాజరైన జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి
* జిహెచ్ఎంసి పరిధిలోని తూంకుంట, దేవరయాంజాల్, శివ శివానీ కాలనీ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు
* మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 26 :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఏ మెంబర్, తూంకుంట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి క్రిస్మస్ పండుగ ప్రేమ, త్యాగం, శాంతి, సోదరభావాలకు ప్రతీక అని అన్నారు. ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు సమానమేనని పండుగలు సమాజంలో ఐక్యతను, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సూర్య ప్రకాశ్, ఇమాన్యుల్, రాజాధి ప్రసాద్, కళ్యాణ్ కుమార్, సీతారామ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పన్నాల వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహా రెడ్డి, మాజీ వార్డు సభ్యులు దుర్గం ప్రకాష్ గౌడ్, నాయకులు దుసరి మహేష్ గౌడ్, నానిగళ్ళ శ్రీనివాస్, పనగట్ల శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
