జీర్లపల్లిలో క్రిస్మస్ వేడుకలు: నూతన సర్పంచ్ శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసన పరిధిలోని ఝారసంఘం మండలం జీర్లపల్లి గ్రామంలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని చర్చి వద్ద నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజశేఖర్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
