“MP makes surprise inspection at Chittoor Government Hospital”
*చిత్తూరు ప్రభుత్వం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
*ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రకాల అభివృద్ధి చేసే అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించిన
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
*రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఉన్నతాధికారులకు సూచించిన
*చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్..
చిత్తూరు (నేటి ధాత్రి:
చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలు, వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వార్డులలో వైద్య సేవలను పొందుతున్న రోగులను కూడా పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలు వాటి వివరాలను, ఓపిగ్గా ఆరాదీశారు.
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆధునిక యుగానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అమలు పరిచే ఆధునిక వైద్యం పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు , ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యాన్ని అందించాలని ఎంపీ తెలియజేశారు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రకాల అభివృద్ధి చేసే అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆశయాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యాధికారులు రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యాధికారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు.
