మెగాస్టార్ చిరంజీవి తాజా తన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్గా ఓకే చెప్పారు. గతంలో ఈ రూమర్స్ తెగ ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రానికి సమర్పకుడిగా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఇక చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్ చేసి “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ ఓ పవర్ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు. అనానిమస్ ప్రొడక్షన్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. దీని తర్వాత చిరు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల మాట.