మీరు పిచ్చుకలు కాదు…

కార్మికుల కష్టం దోచుకునే రాబందులు!

గతంలో ‘‘చిరంజీవి’’ చేసిన వ్యాఖ్యలు ‘‘మళ్లీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ గా వైరల్‌’’

అభిమానుల ప్రాణాలు పోతుంటే కలెక్షన్ల కోసం ఆరాటపడే రాక్షసులు.

మానవత్వం లేని సినీ కళంకితులు.

కళామతల్లి పేరు చెప్పి కాసుల కక్కుర్తి కోసం పొర్లాడే శునకాలు.

మీరు కోట్లు తీసుకుంటూ, కార్మికులకు దినసరి కూలీ ఎగ్గొట్టే పాపాత్ములు.

కార్మికుల బలహీనతలు సొమ్ము చేసుకొనే దుర్మార్గులు.

రాజకీయ నాయకులకు పని పాట లేదా?

సినిమాలు తీయమని ఎవడు కోరుతున్నాడు.

సినిమాలు లేకపోతే మీరు బతకలేరు.

జనం జేజేలు లేకపోతే క్షణం గడపలేదు.

అభిమానుల కేరింతలు చూడకపోతే నిద్రపోలేరు.

సినిమా పేరుతో వ్యాపారం సాగిస్తూ, కళాసేవ ముసుగులో వున్న మేకవన్నె పులులు.

మానవత్వం మరిచి, కలెక్షన్లు చూసి మురిసిపోయే మూర్ఖులు.

లేని నవ్వులు పులుముకొని,నొసలు చిట్లించుకునే చిల్లరగాళ్లు.

జనం బిక్ష మీద బతుకే పరాన్న భుక్కులు.

పాపాత్ములను మించిన పచ్చి అవకాశవాదులు.

పశ్చాత్తాపం లేని పరమ నికృష్టులు

పాపం, పుణ్యం రెండూ ఒకటే అనుకునే లోకంలో బతికే కాకులు.

ప్రాంతీయ విద్వేషాలు నింపుకుని, తెలంగాణను వంచించే కర్కషులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వయసు పెరగగానే సరిపోదు. ఆ వయసుకు తగ్గ మాటలు మాట్లాడకపోతే ఎవరైనా విమర్శిస్తారు. పైగా చిరంజీవి లాంటి నటులు సమయం సందర్భం లేకుండా మాట్లాడితే జనం చీ అంటారు. సినిమాల్లో పేరు తెచ్చుకొని, పదవుల కోసం ఆశపడి, రాజకీయాధికారం కోసం అర్రులు చాచి సినిమాలు వదిలేసి, ప్రజా సేవ ముసుగేసుకొని రావాలనుకున్నది చిరంజీవి కాదా? ప్రేక్షదేవుళ్లంటూ వారి పెట్టే బిక్ష మీద ఆదారపడి బతికేతి సినిమా నటులు కాదా? సినిమాల్లో ఓ పేరు రాగానే, ఇక తనను మించిన నటుడు లేడని సినిమా ఆదరణలాగా రాజకీయాల్లోకి వస్తే కూడా రాణిస్తామని పగటి కలలు కని పార్టీ పెట్టింది చిరంజీవి కాదా? అలాంటి చిరంజీవి రాజకీయ నాయకులకు పనిపాట లేదా? అన్నట్లు మాట్లాడొచ్చా? సినిమా కోసం పార్లమెంటు నుంచి, అసెంబ్లీదాకా మాట్లాడాల్సిన అవసరం వుందా? అని ప్రశ్నిస్తారా? అలాంటప్పుడు సినిమా విడుదల సమయంలో టిక్కెట్లు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ముందు సాగిల పడేది సినిమా వాళ్లు కాదా? ఆఖరుకు అసెంబ్లీలో సినిమా టిక్కెట్లు అమ్ముకున్న చరిత్ర చిరంజీవికి లేదా? తన తనయుడు రాంచరణ్‌ తేజ్‌ నటించిన సినిమా టిక్కెట్లను అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చి ప్రత్యేక షో వేసిన సందర్భం గుర్తుకు లేదా? అది సినిమా ప్రమోషన్‌లో భాగం కాదా? ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి, సినిమా చూపించి, వారి చేత సినిమా బాగుందని ప్రచారం చేసుకొని వసూళ్లు పెంచుకున్నది చిరంజీవి కాదా? నీతులు చెప్పే ముందు ముందూ వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇక తన జీవితం ప్రజలకు అంకితమని చెప్పించి చిరంజీవి కాదా? ఇకపై సినిమాలు చేయనని అప్పట్లో స్వయంగా ప్రకటించింది చిరంజీవికాదా? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రినౌతానని ప్రజారాజ్యంపెట్టి 180 సీట్లు సాధిస్తామని గొప్పలు చెప్పుకున్నది చిరంజీవి కాదా? పార్టీ పెట్టి కోట్ల రూపాయాలు విరాళాలు సేకరించలేదా? చిరంజీవి కోసం అనేక త్యాగాలు చేసిన అభిమానులకు టిక్కెట్లు ఇస్తానని చెప్పి, వారికి తీరని అన్యాయం చేసింది చిరంజీవి కాదా? చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసి ఆస్ధులు అమ్ముకొని ఆయనను నమ్ముకొని రాజకీయాల్లోకి వస్తే, టిక్కెట్లు ఇచ్చే సమయంలో ముఖం చాటేసి వారికి తీరని అన్యాయం చేసింది చిరంజీవి కాదా? నైజాం కలెక్షన్ల మీద ఆధారపడి బతికింది చిరంజీవి కాదా? ప్రజా రాజ్యం పార్టీ పెట్టి సామాజిక తెలంగాణ అని సన్నాయి నొక్కులు నొక్కింది చిరంజీవి కాదా? సామాజిక న్యాయం అంటే ఏమిటని ఓ జర్నలిస్టు అడిగితే నీళ్లు నమిలింది చరింజీవి కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్‌ 9 2009నాడు రాగానే తన ఎమ్మెల్యే పదవికి చిరంజీవి రాజీనామా చేయలేదా? తెలంగాణకు తాను పచ్చి వ్యతిరేకి అని నిరూపించుకోలేదా? తెలంగాణ రాకుండా అడ్డుకునేందుకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి పదవి పొందలేదా? అలా కేంద్ర మంత్రి పదవి పొంది తెలుగునేలకు చేసిన మేలేమీ వుంది? తెలంగాణ ఏర్పడి, రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాలు చేసుకుంటున్నది చిరంజీవి కాదా? అవకాశ వాద రాజకీయాలను చేసింది చిరంజీవే కదా? చిరంజీవి రావయ్యా? అని తెలుగు ప్రజలు కోరుకున్నారా? రా..రమ్మని పిలుస్తున్నారని భ్రమ పడి, రాజకీయ అవకాశాలు రాకపోవడంతో ప్రజా సేవను గాలికి వదిలేయలేదా? ఒక రాజకీయ నాయకుడై వుండి పార్లమెంటు సభ్యులను, శాసన సభ్యులకు పని లేదా? అని ప్రశ్నించడం అవివేకం కాదా? అయినా సినిమాలకు ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయాలి. సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం చేసే చిరంజీవి లాంటి వారి కళ్ల ముందు పనిచేసే కార్మికుల కష్టసుఖాలు ఏనాడైనా తెలుసుకున్నారా? వారి జీవితాలు ఎలా వున్నాయో కనిపించడం లేదా? హీరోలుగా చేస్తూ,కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ, కార్మికులకు రోజు వారీ కూలీ చెల్లించడం నిజం కాదా? సినిమాలో పనిచేసే సహ నటులతోపాటు, లైట్‌ బాయ్‌ వరకు ఇస్తున్న కూలీ ఎంత? మీరా ప్రజల గురించి మాట్లాడేది? సినిమాలు నడస్తే బతికేది కార్మికులు కాదు? హీరోలు. నలభై ఏళ్లుగా హీరోగా చేస్తున్న చిరంజీవి కోట్లు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి సినిమాలోకి వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులకు ఇప్పటికీ కనీసం సొంత ఇల్లు లేదు. సినిమా వాళ్లు పిలవకపోతే బతకలేరు. కాని మీరు మాత్రం సినిమా లేకున్నా బతికేంత సంపాదించుకున్నారు. కనీసం సినిమా హిట్‌ అయితే వచ్చే ఆదాయంలో ఏనాడైనా కార్మికులకు పంచిన సందర్భాలున్నాయా? నిన్నటిదాకా విర్రవీగిన వాళ్లు, ఇప్పుడు తగ్గాల్సిన పరిస్ధితులు ఎదురుకాగానే పిచ్చుకలమని సానుభూతి పొందాలనుకున్నారా? వేల కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు? వేల రూపాయల టిక్కెట్ల రేట్లు పెట్టి సినిమాలు ఎందుకు ప్రదిర్శస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే సినిమా పని అయిపోయింది. పెట్టిన పెట్టుబడి రెండు మూడు రోజుల్లోనే సంపాదించుకోవాలన్న కక్కుర్తి పెరిగిపోయింది. అయినా గతంలో సినిమా కేవలం ధియేటర్ల వల్లనే ఆదాయం వచ్చేది. కాని ఇప్పుడు ధియేటర్‌ ఆదాయంతోపాటు ఓటీటీలు వచ్చాయి. సాటిలైట్‌ హక్కులతో కూడా కోట్లు వచ్చి చేరుతున్నాయి. అయినా ఇంకా కక్కుర్తి ఎందుకు? జనం ప్రాణాలతో చెలగాటమాడడమెందుకు? అల్లు అర్జున్‌ చేసింది పొరపాటా..గ్రహపాటా పక్కన పెడితే, ఆయనను వెనకురావడం చిరంజీవి లాంటి వారికి తగదు. కేవలం తమ ప్రయోజనాలు తప్ప ప్రేక్షకులు ఎలా పోతే మాకేంటి? అనుకునే దౌర్భాగ్యం సినిమా వాళ్లలో పెరిగిపోయింది. సినిమా అంటే ప్రజలకు వినోదం. కాని సినిమా వాళ్లకు వ్యాపారం. ఓ వైపు కార్మికుల కష్టం దోచుకుంటున్నారు. వారికి న్యాయంగా అందాల్సిన కూలీని కూడా మింగేస్తున్నారు. సినిమాలో పనిచేయాలన్న బలహీనతతో వచ్చిన వారి జీవితాలు గుల్ల చేస్తున్నారు. వారు పస్తులుంటుంటే చూస్తున్నారు. అలాంటి సినిమా పెద్ద నటులు పిచ్చకలెలా? అవుతారు? రాక్షసులౌతారు. రాబంధులౌతారు. సినిమా చూడాలని వేల రూపాయలు పెట్టి టిక్కెట్‌ కొనుక్కొని వచ్చిన వారిని సినిమా చూడనీయకుండా, ధియేటర్లకు వెళ్లి వేలం వెర్రి వేషాలు వేయడం దిక్కుమాలిన తనం. మానవత్వం లేని కళంకితులు అనేది ఎప్పటి నుంచో వారి మీద విమర్శలున్నాయి. చిరంజీవిని చూడడానికి అభిమానులు ఆయన వద్దకు వెళ్తే గతంలో ఏం చేశాడో చూశాం. వారిని తిట్టిన సందర్బాలున్నాయి. సినిమా విషయానికి వస్తే మాత్రం ప్రేక్షకులు దేవుళ్లయిపోతారు. అదే అభిమానులు హీరో దగ్గరకు వస్తే దెయ్యాలను చూసినట్లు చూస్తారు. వారిని చీదరించుకుంటారు? పక్కకు నెట్టేస్తుంటారు. వారిపై దాడులు చేయిస్తుంటారు. ఇదేనా హీరోయిజం. ఇదే మీలో వున్న మానవత్వం. ప్రేక్షకుల కేకలు వినిపించకపోతే నిద్రపోలేరు. కాని అదే అభిమాన ప్రేక్షకులు దగ్గరకి వస్తే చీదరించుంటారు. చీఛీ అని దూరం జరుగుతారు. అభిమానులు కేరింతలు కొట్టకపోతే క్షణం గడపలేరు. కాని అదే అభిమానులు ఎంతో ఆత్రంగా దగ్గరకు వస్తే తోసేసి, వారి మీద పిడుగుద్దులు గుప్పిస్తారు. ఓ వైపు పుష్ప సినిమా చూడడానికి వచ్చిన మహిళ తొక్కిసలాటలో చనిపోతే సినీ పెద్దగా చిరంజీవికి బాధ్యత లేదా? సినిమాకు నేనే పెద్ద దిక్కు..నేనే లెజెండ్‌..నాకంటే తోపు లేరని చెప్పుకునే చిరంజీవి ఇప్పటి వరకు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాబును పరామర్శించాడా? ఇరవై రోజులుగా ఈ సమస్య నలుగుతుంటే కనీసం మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడానికి కూడా చిరంజీవికి నోరు రాలేదు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడానికి కూడా మనసు రాలేదు. కాని కార్మికులకు రూపాయి సాయం చేసి వంద రూపాయల ప్రచారం చేసుకోవడానికి మాత్రం నోరు వస్తుంది. సినిమాలు, ప్రకటన పేరుతో కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే వారికి సమయం వుంటుంది. కాని సినిమా కోసంవచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయిన అభిమాన కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత సినీ పెద్దగా చిరంజీవికి లేదా? ఇలా అడిగేవారు ఎవరూ లేక సినిమా పెద్దల ఆటలు సాగుతున్నాయి. ప్రేక్షకులు ఇచ్చే ముష్టితో ముష్టిబతుకులు బతుకుతూ, సెలబ్రిటీల ఫోజు కొట్టడం మాత్రమే తెలుసు. అందుకే సినీ పెద్దలు, మంచం మీద నల్లులకు పెద్ద తేడా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!