
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గొడిసెలపేట గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ( బీసీ కాలనీ)కు పాఠశాల సమావేశాలు ,స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల వేడుకలకు ఉపయోగపడేలా డీజే బాక్స్ లు,మైక్ సెట్ లతోపాటు వేసవికాలంలో తరగతి గదులలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీలింగ్ ఫ్యాన్లను మానవతా దృక్పథంతో అదే గ్రామానికి చెందిన చింతల వెంకటేశం( వెల్డింగ్ వెంకట్)బహుకరించారు. ఈ మేరకు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మునీంద్ర కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మునీంద్ర మాట్లాడుతూ పాఠశాల యొక్క అవసరాలను గుర్తించి మానవతా హృదయులైన చింతల వెంకటేశం సుమారుగా 35 వేల విలువైన వస్తువులను బహూకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. చంద్రశేఖర్, సిహెచ్. వెంకటస్వామి, పి.అశోక్ కుమార్ లతోపాటు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులుపాల్గొన్నారు.