
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పదిలక్షల 20వేల చెక్ అందజేత.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.వారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నందు 35000/-(ముప్పై ఐదువేల రూపాయల) వార్షిక ప్రీమియంతో ఆరు సంవత్సరాల క్రితం పాలసీ చేశారు. ఆ పాలసీకి సంబంధించిన బీమా క్లెయిమ్ 10,20,000/-(పదిలక్షల ఇరవై వేల రూపాయలు పెన్షన్ తో కలిపి) నామినీ అయినటువంటి చింతకింది రవి కి మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వరంగల్ డి ఎం వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా పాలసీలు చేసుకోవాలని చెప్పారు.పరకాల బ్రాంచ్ మేనేజర్ రాజు మాట్లాడుతూ ఆదాయానికి తగినంత బీమా ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్స్ అల్లం రాజు ,జంగిలి అనూష రాజేందర్,తిరుపతి గ్రామ పెద్దలు రాంరెడ్డి జనార్దన్ రెడ్డి గారు,సంస్థ ఉద్యోగులు సందీప్,అనిల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.