సిరిసిల్ల, మే – 8(నేటి ధాత్రి):
బుధవారం సిరిసిల్లలోని బి.వై నగర్ హనుమాన్ దేవాలయంలో చిన్మయమిషన్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్మయానందస్వామి 108వ జయంతిని పురస్కరించుకొని పూజ కార్యక్రమం జరిపారు. భగవత్గీత పఠనం, అష్టోత్తర శతనియామవాలి తదితర అంశాలు నిర్వహించారు.
ఇందులో చిన్మయమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సజ్జనం శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్మయమిషన్ సంస్థను పూజ్యశ్రీ చిన్మయానంద స్వామి స్థాపించి వందల మంది స్వాములు, ఆచార్యులను తయారు చేశారాని అన్నారు. వీరంతా వివిధ ప్రదేశాలలో జ్ఞానయజ్ఞాలను ఏర్పాటు చేసి భగవత్గీత మొదలగు ఆధ్యాత్మిక గ్రంధాలపై ప్రవచనాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ రోజు స్వామి 108వ జయంతిని ఘనంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో కోడం నారాయణ, జనపాల శంకరయ్య, గజ్జెల్లి రాంచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మహేందర్ పూజారి, సృజన, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.