ఘనంగా.. చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు
జడ్చర్ల / నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దయపల్లి చౌరస్తాలో బుధవారం రాజపూర్ మండలంలోని దొండ్లపల్లి మాజీ ఎంపీటీసీ.. చొక్కంపేట గ్రామానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమన్యు రెడ్డికి గజమాలతో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. రాజాపూర్, బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్న..40 మంది గిరిజన విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.