#వైరస్, బొబ్బరిని తట్టుకునే శక్తి బాల సంకరజాతి విత్తనానికి కలదు.
#హెనిష్ట సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ రామచంద్రారెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: హెనిష్ఠ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బాల సంకరజాతి మిరప విత్తన పంట క్షేత్ర ప్రదర్శనను వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని వల్లే నరసయ్య పల్లె గ్రామంలోని రైతు వల్లే బాబు పంట క్షేత్రంలో కంపెనీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టగా వేలాదిమంది రైతులు బాలమిరప పంటను పరిశీలించారు ఈ సందర్భంగా కంపెనీ బిజినెస్ మేనేజర్ రామచంద్రారెడ్డి రైతులతో మాట్లాడుతూ బాల మిరప విత్తనం వేయడం ద్వారా పంటలో వైరస్, బొబ్బరిని తట్టుకునే శక్తి ఉండి తద్వారా ఎకరాకు 30 నుండి 40 క్వింటాన్ల దిగుబడి పొందవచ్చని చివరి కొమ్మ వరకు కాయలు ఉండడం బాలమిరప విత్తనానికి ప్రత్యేకత అని రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వరగల్ వంశీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డిస్ట్రిబ్యూటర్స్ సవాయి రవి ,శ్రీనివాస్, నల్లబెల్లి శ్రీ శ్రీనివాస సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ యజమాని శివనాత్రి శ్రీనివాస్, నర్సంపేట రైతు ఆగ్రో సేవా కేంద్రం కారుకూరి శ్రీనివాస్, మల్లికార్జున ట్రేడర్స్ నితీష్, కంపెనీ ప్రతినిధులు వినయ్, హరికృష్ణ, మధు, కోటేశ్వరరావు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.