Child Rights Week Celebrated Grandly in Sircilla
ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు
నవంబర్ 20 అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బాలల హక్కుల వారోత్సవాలు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో సంస్థలలో విద్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సిడిపిఓ సిరిసిల్ల పరిధిలో రగుడు అంగన్వాడీ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారి హాజరయ్యారు ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలు చిన్నారులతో వారికి అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అలాగే వారికి ఆహర భద్రత చట్టం గురించి, విద్యా హక్కు చట్టం గురించి వివరించారు. లింగ నిర్ధారణ చేయడం గర్భవిచ్చితికి పాల్పడడం వల్ల బాలికలను నిష్పత్తి తగ్గిపోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇది చాలా దుష్పరిణామమని దీనివల్ల సమాజంలో భవిష్యత్తులో అనేక అనర్ధాలు కలుగుతాయని వివరించారు. తర్వాత గర్భిణీలు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దివ్య డిసిపిఓ కవిత బిహబ్ కోఆర్డినేటర్ రోజా పాల్గొన్నారు..
అలాగే తదనంతరం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రంగినేని ట్రస్టులో వయోవృద్ధులతో ముచ్చటించారు. వారికి సంబంధించిన ఆరోగ్య ఆర్థికపరమైన సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు అకౌంట్లు ఉన్న బ్రాంచీలు దూరంగా ఉండటం వలన వయోభారంతో వెళ్లలేకపోతున్నామని తెలియజేయగా వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి సమాచారం ఇచ్చి అకౌంట్లు ఓపెన్ చేయుటకు కోరడం జరిగింది. అలాగే ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం నివాసితులు నటరాజ్ థియేటర్లో కాంత సినిమాకు తీసుకుని వెళ్లడం జరిగింది. వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా సినిమాను వీక్షించారు… ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం కోఆర్డినేటర్ మమత డిహబ్ కోఆర్డినేటర్ రోజా డిసిపిఓ కవిత పాల్గొన్నారు.
తదనంతరం తంగళ్ళపల్లి లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ ని కలిసి భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడానికి వారి యొక్క సహాయ సహకారాలను కోరడం జరిగింది. అలాగే అక్కడ జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహ చట్టం గురించి వివరించడం జరిగింది. బాల్య వివాహం వలన కలిగే శారీరక మానసిక సామాజిక దుష్ఫలితాలు దుష్పరిణామాల గురించి పిల్లలకు విపులంగా వివరించడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. ఇక్కడ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి జయ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
