ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు
నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో చిన్న పిల్లలు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా రంగురంగుల రంగులతో ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతో చల్లుకుంటూ రంగులు పూస్తూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఈ హోలీని జరుపుకున్నారు.