అంగన్వాడిలో 3సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలను నమోదు చేయించాలి.
ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.
చిట్యాల నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక అంగన్వాడీ కేంద్రంలో జీ జయప్రద సూపర్వైజర్ నిర్వహించిన సెక్టార్ సమావేశమునకు 28 మంది అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు మీటింగ్ యొక్క ఉద్దేశం ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు టీచరు ఆయాసమయ పాలన పాటించాలని మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల నమోదు హాజరు శాతం పెంచుకోవాలని ప్రతి నెల పిల్లల బరువులు ఎత్తులు తీసి శామ్ మామ్ పిల్లల్ని గుర్తించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు కిషోరా బాలికల బరువు ఎత్తు చూసి పల్లి పట్టీలు ఇవ్వాలని వివరించి ఆషాడ మాసము అయినందున టీచర్లతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి టీచర్స్ అందరూ కలిసి భోజనము చేసి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా అంగన్వాడి కేంద్రాలన్నీ పిల్లలతో కలకలలాడాలని అన్ని గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది 28మంది టీచర్స్ హాజరైనారు