బాల వికాస పతకాలు ఆలోచనలు రేకిత్తిస్తాయి.. స్వచ్చంద సంస్థలకు ఆదర్శం బాలవికాస…

ప్రజా భవన్ – 19-01-2024

బాల వికాస వినూత్న ఒరవడితో నిర్మితమైన అనేక పథకాలు ప్రభుత్వాలకు పలు శిక్షణ కార్యక్రమాల ద్వారా సమర్థ నాయకులుగా తీర్చిదిద్దిన బాల వికాస మూఢ నమ్మకాలను ప్రారదోలడంలో ముందున్న బాల వికాస ఆదర్శనమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఫాతిమానగర్ లోని పిడిటిసి ట్రైనింగ్ సెంటర్లో సమర్థ సుస్థిరాభివృద్ధి అనే అంశం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వినూత్న కార్యక్రమం చేపట్టిన అది బాలవికాస నుండే ప్రారంభమవుతుందని అన్నారు. మహిళా పథకమైన, చెరువు పూడికతీత పనైనా, అనాధ పిల్లలు, వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి మరెన్నో ఉన్నాయని అన్నారు. బాలవికాస వినూత్న ఒరవడితో, ప్రజల భాగస్వామ్యంతో, పరిస్థితులకు అనుగుణంగా, స్థానిక వనరులను వినియోగించుకొని పథకాలను రూపొందించి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తు అంతమందికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. వివిధ శిక్షణాల ద్వారా సామాన్య ప్రజలను ఉత్తేజపరిచి గొప్ప నాయకులుగా తయారు చేసే సంస్థ బాల వికాస అన్నారు.

వితంతు విముక్తి ఉద్యమం ద్వారా మూడ నమ్మకాలను ప్రారదోలడంలో బాల వికాస చేస్తున్న కృషి అభినందనీయం. భవిష్యత్తులో వినూత్నమైన ఆలోచనలతో మరిన్ని పథకాలకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తానని తెలిపారు.

47 సంవత్సారాల నుండి ఇలాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ వ్యవస్థాపకురాలు బాల థెరిస్సా సేవలు అభనందనీయులని అన్నారు.

­

ఈ టిపిసిసి ఎస్.సి. డిపార్టుమెంటు కో-ఆర్డి నేటర్ ఎం.పి ఆనంద్ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కేమికాల్ టెక్నాలజీ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ శ్రీధర్, రాష్ట్ర పునరుద్ధరణ ఇందన వనరుల అభివృద్ధి సంస్థ వరంగల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, బాల వికాస సంస్థ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరి రెడ్డి, బలవికాస ఫెడరేషన్ డైరెక్టర్ కేడం లింగమూర్తి సోపార్ కెనడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభ, బాల వికాస అధ్యక్షులు నోముల ఇంద్రా రెడ్డి, ఉపాధ్యక్షులు బాసని మర్రెడ్డి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *