తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి:
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో తిరగాలని కోరుతూ చీకటియపాలెం గ్రామంలో గురువారం దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉపవాస దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా చీకటియపాలెం గ్రామ మహిళలు మాట్లాడుతూ బుధవారం కాసం షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో జరిగిన ప్రమాద ఘటనలో ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని దుర్గామాత విగ్రహాన్ని వరంగల్ నుంచి తెప్పించి గ్రామంలో పూజలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు
బోలగాని పద్మయ్య, పల్లె దయాకర్ గౌడ్, తండా రవి, బొలగాని రవి, వెలికట్ట యాకయ్య, కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు బొలగాని ఊర్మిళ, జీడికంటి కవిత బోలాగాని వరమ్మ, బొలగాని లక్ష్మి, బోలాగాని పద్మ, బొలగాని స్వప్న, బోలాగాని రజిత, బొలగని స్వప్న పోడకంటి బుచ్చమ్మ కొండ ఐలమ్మ నాగమ్మ, ఉపేంద్ర, మమత, వరమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.