
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఈ పథకం.ఎంతో ఉపయోగ పడుతుందని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు తెలిపారు.
శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ
పరిధిలోని లక్ష్మిదేవిపల్లి మండలం, ఇందిరానగర్ లోని మండల ప్రాధమిక పాఠశాలలో సియం అల్పాహార పథకాన్ని
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యాలయం, దేవాలయం, వైద్యాలయం ఎంతో
ప్రసిద్ధమైనవని చెప్పారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించేది విద్యాలయమని, పేద కుటుంబాల విద్యార్థులకు
ఈ పథకం వరమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా
అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఉదయం రాగి జావ, అల్పాహారం, మధ్యాహ్నం పోషకాలతో కూడిన
భోజనం అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ఈ పథకాలు మన రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు.