ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలంలో రామచంద్రపుర గ్రామ రైతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకంచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలానికి ఆనుకుని ఉన్న దాచారం బానప్ప చెరువు నిండడం వలన ఆయకట్టు కింద ఉన్న రామచంద్రపురం మరియు మరికొన్ని గ్రామాలకు పొలాల్లో నీళ్లు లేక ఎండిపోకుండా జక్కాపూర్ కె నాలినుండి నీటి విడుదల చేయించి మండలానికి నీరు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి రైతుల కులాలకు నీరు అందే విధంగా కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జికేకే మహేందర్ రెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు ఇందులో చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు