గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో నూతనంగా చీఫ్ ఇంజనీర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన చిత్తప్రగడ శ్రీ ప్రకాష్ గారిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్-58 యూనియన్ జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం గారి ఆద్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పూల బొకే అందించి శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఓ & ఎం కార్మికుల పదోన్నతులు కల్పించుటకు డిపిసి కండక్ట్ అర్టీజన్ కార్మికులకు యూనిఫాం , రేయిన్ కోట్, సీనియరిటీ జాబితా పలు సమస్యలు వారి దృష్టి కి తీసుకెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్వికెఎస్ రాష్ట్ర నాయకులు కెటిపిపి రిజినల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ ముఖ్యనాయకులు సభ్యులు అర్టీజన్ కార్మికులు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు నూతనంగా విచ్చేసిన చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ మీ యొక్క అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలు వివరాలు సేకరించి సాద్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యే ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పారు