చిట్యాల ,నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో *త్రపతి సాహు మహారాజు జయంతి*కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగినది. ముందుగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లయ్య మాట్లాడుతూ. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి అవకాశాల కోసం రిజర్వేషన్ల కల్పించి సామాజిక న్యాయానికి పునాదులు వేసిన మొట్టమొదటి భారతదేశపు చక్రవర్తి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజు అన్నారు.. ప్రభుత్వం పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు హక్కులు 19వ శతాబ్దం లోనే తన కొల్లాపూర్ ప్రజలకు అందించారని తెలిపారు. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు వెనుక బడిన కులాల వారందరికీ పాఠశాలలు వసతి గృహాలు ప్రారంభం చేసి ఒక ఉద్యమం లా నడిపాడు అని తెలిపారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల్లో వెనుకబడిన కులాల వారందరికీ 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ నాయకులు పుల్ల ప్రదీప్ రాజమౌళి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.