
చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ సోమవారం రోజున చత్రపతి శివాజీ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు గర్వించదగ్గ విధంగా పరిపాలన కొనసాగించినటువంటి చత్రపతి శివాజీని భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ ఆదర్శంగా తీసుకోవాలని ఒక పోరాట యోధునిగా తను నమ్మిన ధర్మం కోసం హైందవ ధర్మాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి శివాజీ మన దేశంలో పుట్టడం మన భారతదేశ ప్రజలందరికీ అదృష్టమని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ బిజెపి మండల ఉపాధ్యక్షులు గజనాల రవీందర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు అశోక్ చారి చింతల రాజేందర్ బుర్రి తిరుపతి గుర్రపు రవి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.