మంచిర్యాల, నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజున చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు మొక్కుకున్న కొండగట్టు మొక్కు ను తీర్చుకోవడానికి స్వామివారి సన్నిధికి వచ్చానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు.అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి 105 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని ,ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తున్నామని,
సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఉండి ప్రగతి భవన్ ఇనుప కంచేలు బద్దలు కొట్టి ప్రభుత్వం పై ప్రజలకు భరోసా కల్పించారని,స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం విడుదల చేసిన 10 కోట్ల రూపాయలు ప్రజాభివృద్ధికి వినియోగిస్తామన్నామనీ,మిషన్ భగీరథ ఫెయిల్యూర్ వల్ల ఏర్పడిన తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో గుట్ట క్రింద కోతులకు ఆహారం అందజేసి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.