చెన్నూర్ శనిగకుంట చెరువు నిందితుల అరెస్ట్

చెన్నూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చెరువు శనిగకుంట మత్తడి నీ గుర్తు తెలియని వ్యక్తులు పేర్లు పదార్థాలతో ధ్వంసం చేశారని చెన్నూర్ ఏఈ ఇరిగేషన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ లో 16. 09. 2024 ఫిర్యాదు చేశారు. పోలీసు వారు విచారణలో సాక్షాదార సేకరించి 20. 09. 2024 ఉదయం 6 గంటల సమయంలో అనుమానితుడు అయినా పెండ్యాల లక్ష్మీనారాయణ ఇంటి వద్ద కు వెళ్లగా అక్కడ పెండ్యాల లక్ష్మీనారాయణ అలియాస్ లక్ష్మణ్, భీమ్ మధుకర్ అలియాస్ మాధవ్, రసమల శ్రీనివాస్ ఉండగా వారిని విచారించి ఆ విచారణలో పై ముగ్గురు వ్యక్తులు నేరాన్ని గోగుల దానయ్యతో కలిసి చేశామని ఒప్పుకున్నారు. గోగుల దానయ్య ను విచారించగా అతడు కిష్టంపేట శివారు వద్ద ఉన్నాడని తెలపడంతో వెంటనే అక్కడికి వెళ్ళగా ట్రాక్టర్ తో కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం జరిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అతని వద్ద ఉన్న కంప్రెసర్ డ్రిల్ మిషన్, జిలేటిన్ స్టిక్స్_4 జె వైర్, ఐరన్ 50 మీటర్ల వైరును పద్ధతుల సమక్షంలో స్వాధీనపరుచుకున్నారు. ప్రధాన నిందితుడు పెండ్యాల లక్ష్మీనారాయణ అలియాస్ లక్ష్మణ్ భార్య పెండ్యాల స్వర్ణలత చెన్నూర్ 11 వార్డ్ కౌన్సిలర్, ఇతని వాడలో శనగకుంట చెరువు కింద కొన్ని ఇండ్లు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువు నుండి ఇండ్లు ముప్పునకు గురవుతున్నాయని మహంకాళి వాడా నుండి ఎన్ హెచ్ 63 హైవేకు ఎటువంటి కల్వర్టులు లేకుండా సిసి రోడ్డు నిర్మించడంతో చెరువు నీరు లోనికి వచ్చి బయటకు పోకుండా ఉంటుందని చెరువు దగ్గరలో నివాసం ఉంటున్న ప్రజలు వాపోయారు. ఈ కేసులో డాక్యుమెంట్స్ కాల్ డేటా బ్యాక్ అకౌంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ ఇంకా ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్ గల వారి ప్రమేయం పైన విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ కేసులోని నిందితులు పెండ్యాల లక్ష్మీనారాయణ, భీమ్ మధుకర్, రాస మల్ల శ్రీనివాస్, గోగుల దానయ్య.
ఈ కేసును చేదించడంలో కృషిచేసిన ఏసిపి వెంకటేశ్వర్లు, చెన్నూరు ఎస్సై రవీందర్, ఎస్ఐ శ్వేత, కానిస్టేబుల్స్ టీకయ్య, భూమన్న, అబ్దుల్ ఖదీర్ లను డిసిపి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *