చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ నేతకాని కులస్తులకె కేటాయించాలి

*లేని పక్షాన ఓటు ఆయుధంతో బుద్ధి చెప్తాం

జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు

జైపూర్, నేటి ధాత్రి:

చెన్నూర్ కి కాంగ్రెస్ టికెట్ నేతకాని కులస్తులకే కేటాయించాలని జైపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణములో తెలంగాణ నేతకాని మహవీరు హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గం ఎల్లయ్య ఆధ్వర్యంలో నేతకాని కులస్తులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేతకాని కులస్తులను గుర్తించలేదని చెన్నూరులో ఈసారైనా నేతకాని బిడ్డకు టికెట్ ఇచ్చి గుర్తించాలని అన్నారు. బిజెపి కాంగ్రెస్ తో పాటు ఇతర ఏ పార్టీ అయినా చెన్నూరు నియోజకవర్గానికి నేతకాని కులస్తులకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి గోమాసే శ్రీనివాస్ కి టికెట్ కేటాయిస్తే 60 వేల అత్యధిక జనాభా ఉన్న నేతకాని కులస్తులమందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. లేని పక్షాన కులస్తులందరం ఒక్కటై ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!