ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరు.. గైర్హాజరు అయ్యారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.
అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు కలిసి తనిఖీ చేశారు. ప్రతీ గదిని సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.