గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరిగే సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మండపం చుట్టూ గల ఆవరణకు రేకుల షెడ్డు కొరకు సోమవారం గణపురం వాస్తవ్యులైన సూర్యదేవర స్రవంతి కార్తీక్ దంపతులు చెక్కు అందజేశారు. అనంతరం శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సూర్యదేవర స్రవంతి కార్తీక్ దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు. సూర్యదేవర కార్తీక్ వారి తండ్రిగారైన కీర్తిశేషులు సూర్యదేవర ప్రకాశం గుప్తా జ్ఞాపకార్థం రూ. 51,000 రూపాయలు గల చెక్కును ఆలయం కమిటీ కి అందజేయటం జరిగింది. దాతలకు అర్చకులు ముసునూరి నరేష్ తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన గౌడ్, రౌతు వెంకన్న, పోశాల కిషోర్, మార్క రమేష్ పాల్గొన్నారు