సర్వే నెంబర్ 113,114లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి
చౌటుప్పల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్డులోని 113,114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీవో జగన్నాధ రావుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్డు లోని 113 ,114 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇట్టి విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి స్థానిక ఆర్డిఓ కి తెలిపామన్నారు.ఆర్డిఓ జగన్నాధ రావు అట్టి భూమిని గతనెల జనవరి 20న సర్వే చేయించి హద్దురాల నాటి బౌండరీలను ఫిక్స్ చేశారన్నారు. కానీ రెండు రోజులు తిరగకముందే గుర్తుతెలియని వ్యక్తులు హద్దురాలను రాత్రి వేళలో కూల్చివేసారని అన్నారు. అట్టి సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక అధికారులకు గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అట్టి ప్రభుత్వ భూమికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించారన్నారు. ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ప్రభుత్వ భూమిని కాపాడాలని తాము నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు. ఇట్టి ప్రభుత్వ కాపాడాలని ఆర్డిఓ కి వినతి పత్రం ఇచ్చినామని అన్నారు. ఇట్టి ప్రభుత్వ భూమిలో ఎంతోకలంగా ఎదురు చూస్తున్నా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఆదుకోవాలని ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండలం జర్నలిస్టులు తంబారేణి రవీందర్, ఎర్ర సాని సతీష్ కుమార్, మంచికంటి రమేష్ గుప్త, కొండమడుగు శ్రవణ్ కుమార్, తిరుమలగిరి వెంకటేశ్వర్లు, ఆరుట్ల లింగస్వామి, కూచిమల్ల భగవంతు, ఊదరి శ్రీకాంత్, వరికుప్పల తోనేశ్వర్, బొమ్మ మల్లేష్, పల్లపు కృష్ణ, ఊదరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.