కాల్పుల హోరు నుంచి ప్రగతి కాంతులవైపు

అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఛత్తీస్‌గఢ్‌
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల సంఘటనలతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికల్లో నిలిచే రాష్ట్రంగా పేరుపడిరది. అందువల్ల చత్తీస్‌గఢ్‌ అంటేనే నక్సల్స్‌ మరియు ఎన్‌కౌంటర్‌ వార్తలు తప్ప మరే యితర సమాచారం మనలకు పెద్దగా లభ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు ప్రశ్న, అభివృద్ధి పథంలో ఏవిధంగా ముందుకెళుతున్నదనేది ప్రధానం! వామపక్ష తీవ్ర వాదం వల్ల చోటుచేసుకున్న హింసాకాండ నేపథ్యంలో అభివృద్ధి మసకబారినట్టు కనిపించిన నేపథ్యంలో ఇక్కడి ప్రగతి ఉషోదయ కాంతులు, ఇతర రాష్ట్రాలకు తెలియకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోణాన్ని స్పృజిస్తే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయనేది మాత్రం సుస్పష్టం. ఒక్కసారి ఈ కోణంలో చత్తీస్‌గఢ్‌ను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గుతున్న క్రమంలో, మరోవైపు రాష్ట్రంలో తయారీ, సేవా రంగాలు క్రమంగా ఊపందుకోవడం వర్తమాన పరిణామం. రాష్ట్రంలో రూ.4.5లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. మేనెల మొదట్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డే టా పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో, దేశంలోనే మొట్టమొదటి ఏఐ సెంట్రల్‌ పార్క్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా నిలిచింది. అంతకు ముందు అంటే గత ఏప్రిల్‌ నెలలో సెమికండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గాలియం నైట్రైడ్‌ ఆధారిత చిప్‌ల తయారీకేంద్రం. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించి ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరమైంది. కేంద్రం ఒకపక్క రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024 నవంబర్‌ 1నుంచి అమల్లో వుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన కేవలం ఆర్నెల్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5లక్షల కోట్ల వి లువైన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5.09లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అవగాహనా ఒప్పందాల మొత్తం జీఎస్‌డీపీలో సింహభాగమనదగ్గ స్థాయిలో వుండటం విశేషం. నిజానికి ఈ అవగాహనా ఒప్పందాలన్నీ వాస్తవరూపం దాలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీ దాదాపు రెట్టింపు అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ అవగాహనా ఒప్పందాలు కుదరడం మొదటిదశ అయితే, వీటి అమలు రెండోదశగా భావించాల్సి వుంటుంది.
గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం అప్పటివరకు అమల్లో వున్న పారిశ్రామిక విధానంలో ఏఏ మార్పులు తీసుకురావాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏ ర్పాటు చేసి మేధోమధనం జరిపారు. అంతేకాదు నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇవ్వడానికి ముందు, దీనికి సంబంధించిన భాగస్వాములు, పారిశ్రామికవేత్తల సలహాలను, సూ చనలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ముసాయిదాను రూపొందించే స మయంలో రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక మరియు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్రం లో బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలు అపరిమితంగా వున్న నేపథ్యంలో, ఈ రెండిరటిని కీలక పరిశ్రమ లుగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో కేవలం బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలే రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌గా స్థిరపడకుండా, ఇతర రంగాలు ముఖ్యంగా సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాదు ఔషధాలు, వస్త్రపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఆహార పరిశ్రమలు, విద్యుత్‌ మరియు ఎలక్ట్రానిక్‌ రంగాలపై కూడా ఈ విధాన రూపకల్పనలో దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నవ రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా రూపొందిన నేపథ్యంలో దీన్ని ఐ.టి. హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని బస్తర్‌, సర్గూజా జిల్లాల్లో ఒక్క పరిశ్రమ స్థాపన ఇప్పటివరకు జరగలేదు. ఈ ప్రాంతా ల్లో కూడా పారిశ్రామికాభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం రెడ్‌టేపిజం. అనుమతులు రావాలంటే ఒక ప్రభుత్వ శాఖనుంచి మరో శాఖకు తిరగడం తప్ప ఫలితం వుండని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అనేక శాఖల అనుమతులు తీసుకోవాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రం లో భూమి కొనుగోలు చేయాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా కఠిన నిబంధనలు అమల్లో వున్నా యి. పరిశ్రమలు రాకపోవడానికి ఇదికూడా ఒక కారణం. ఇదేసమయంలో ఎవరైనా పరిశ్రమ లు పెట్టాలనుకున్నా, ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహకాలు అందవు! రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్‌ పార్క్‌లు లేవు. అసలు కొత్త తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు అనుగుణమైన నిబంధనలే లేవు. ఈ ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి 2024, అక్టోబర్‌ నెలలో మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలానికి అనుగుణంగా ఈ ముసాయిదా రూపకల్పన చేసింది. అంటే 2030 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో వుంటుంది.
ఈ నూతన పారిశ్రామిక విధానం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపును అనేకరెట్టు పెంచింది. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు కేటాయింపులను మూడురెట్లు పెంచింది. ఈ నేపథ్యంలోనే 2025`26 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక`వాణిజ్య శాఖకు ఏకంగా రూ.709.87 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 34 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసివున్నందున, వీటిల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వనుంది. అనుమతుల సమస్యను అధిగమించేందుకు ‘సింగిల్‌ విండో’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ఇ ప్పుటికు అమల్లో వున్న నిబంధనల్లో 350 మార్పులు చేశారు. కొత్తతరం పరిశ్రమలకు అనుకూ లంగా కొత్త నిబంధనలను చేర్చారు.
ఈ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక రంగాన్ని రెండు కీలక సెక్టార్లుగా విభజించింది. మొదటిది ‘చోదక రంగం’ కాగా రెండవది ‘ముఖ్యమైనవి లేదా కీలకమైనవి’. ఔషధాలు, వస్త్రపరి శ్రమ, వ్యవసాయం మరియు ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌, ఏఐ, రోబోటిక్స్‌, కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సెంటర్లను ‘చోదక’ విభాగంలో చేర్చారు. ఈ విభాగం కింద పెట్టు బడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పెద్దమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. అంతేకాదు ఈ విభాగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే మొదటి ఐదు పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సా హకాలు అందిస్తారు. ఇక సంప్రదాయిక పరిశ్రమలైన స్టీల్‌, సిమెంట్‌, అల్యూమినియం, థర్మల్‌, సోలార్‌ ప్లాంట్లను ప్రభుత్వం విస్మరించలేదు. ఈరంగంలో ఫిక్స్‌డ్‌ కేపిట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో నూటికి నూరుశాతం జీఎస్టీ ని మినహాయించారు. దీంతో పాటు ఇతర మినహాయింపులు కూడా ప్ర భుత్వం కల్పిస్తుంది.
రాష్ట్రంలో సమానంగా పారిశ్రామికాభివృద్ధి సాధనకు, జిల్లాలను మూడు గ్రూపులుగా ప్రభుత్వం విడగొట్టింది. వెనుకబడిన జిల్లాల్లో నెలకొల్పే పరిశ్రమలకు మరింత ఎక్కువ రాయితీలు మరియు ప్రోత్సాహకాలు లభిసాయి. ఇందుకోసం 2006లో కేంద్రం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ చట్టం లో కేంద్రం 2020లో తీసుకొచ్చిన సవరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చిన నిర్వచనాల్లో కేంద్రం తీసుకొన్ని సవరణలనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రమాణంగా తీసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా రూ.వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా వెయ్యిమంది స్థానికులు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఆకర్షణీయ ప్రోత్సాహాకాలను ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో రూ.1లక్ష కోట్లు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు సంబంధించినవి. ఇందులో రూ.40వేల కోట్లు ప్రభుత్వ రంగ పరిశ్రమలుకాగా, ఆదానీ వంటి ప్రైవేటు రంగ పరిశ్రమలు రూ.48వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక జిందాల్‌ పవర్‌ రాష్ట్రంలో థర్మల్‌, సౌర విద్యుత్‌ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చింది. వీటిల్లో రాయగఢ్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ ప్లాంట్‌కు రూ.12,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. అదేవిధంగా ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 2500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్‌ ప్లాంట్‌పై రూ.10వేలు పెట్టుబడి పెట్టనుంది. గత మార్చిలో రాయపూర్‌లో జరిగిన ‘చత్తీస్‌గడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌`2025’లో ఈ పెట్టుబడులకు హామీ లభించింది. గత ఏడాది డి సెంబర్‌ నెలలో రెన్యూ పవర్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు కింద రూ.11500 కోట్లు పె ట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక ఉక్కుపరిశ్రమ విషయానికి వస్తే నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ‘జిందాల్‌ స్టీల్‌’ రాయ్‌పూర్‌ బ్రాంచ్‌లో ఏటా 3.6మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. ఈ సంస్థ విస్తరణ కార్యక్రమం 2027 నాటికి పూర్తికాగలదు. ఇదే ఉక్కురం గంలో చిన్నతరహా పరిశ్రమల విషయానికి వస్తే గ్రీన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1245 కోట్లమేర పెట్టుబడులు పెట్టనుండగా, 500 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 46వేల మిలియన్‌ టన్నుల ఉక్కుఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి దీన్ని 65వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఢల్లీి, ముంబయి, బెంగళూరుల్లో ఎనర్జీ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లు నిర్వహించింది. వీటిల్లో ఢల్లీి సదస్సులో రూ.15వేలకోట్లు, ముంబయి సదస్సులో రూ.6వేల కోట్లు, బెంగళూరు సదస్సులో రూ.3700 కోట్ల మేర పెట్టుబడులకు హామీలు లభించాయి.
వచ్చిన పెట్టుబడుల హామీలు ఇప్పుడిప్పుడే వాస్తవరూపం దాలుస్తున్నాయి. నవ రాయ్‌పూర్‌లో సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌కు శంకుస్థాపన జరగడం ఇందుకు ఉదాహరణ. చెన్నైకు చెందిన ఒక కంపెనీ చిప్‌ తయారీకి సంబంధించి రూ.1143 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 5జి, 6జి టెలికమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలకు అవసరమైన హై ఫ్రీక్వెన్సీ చిప్‌లను ఈ కంపెనీ తయారుచేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీ అదనంగా రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టను న్నట్టు ప్రకటించింది. సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌తో పాటు రానున్న నెలల్లో కృత్రిమ మేధ ఆదారిత డేటా పార్క్‌కు వచ్చే నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్ట్‌ మొత్తం 5.5 హెక్టార్ల విస్తీర్ణంలో వుండగా, 500 ప్రత్యక్ష, 1500 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తొలిదశలో ఈ యూనిట్‌ను రాక్‌ బ్యాంక్‌ డేటా సెంటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 5మెగావాట్ల సామర్థ్యంతో ని ర్వహించనుంది. దీన్ని మరో రూ.2వేల కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యానికి పెంచ నుంది.
ఇక రక్షణరంగానికి సంబందించిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) జాంజ్‌గిర్‌` చంపా జిల్లాలో తయారీ యూనిట్‌కోసం వంద ఎకరాల భూమిని సేకరించింది. ఇదిలావుండగా నవ రాయ్‌పూర్‌లో ప్లాంట్‌ నెలకొల్పేందుకు యాష్‌ ఫాన్‌ అప్లయెన్సెస్‌కు, ముంగెలీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆదిత్య బిర్లా రినీవబుల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నవ రాయ్‌పూర్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మంత్రి మండలి గత నెలలో ఆమోదం తెలిపింది. పరిశీలిస్తే 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఇంత ధైర్యంగా ముందుకు వెళుతుండటం ఇదే మొదటిసారని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!