నేటి యువత ఛత్రపతి శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి లోక సభ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి ఉత్సవాలు
ఆరె సంక్షేమ సంఘం నేరెళ్ల గ్రామ కమిటీ ఆధ్వర్యం బాసిరి కిరణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.మహారాష్ట్రలో సాధారణ కుటుంబంలో పుట్టిన శివాజీ స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించి,దేశంలోని బహుజనుల చీకటి బతుకుల్లో దారి దివిటీ అయ్యాడని,స్వరాజ్యంలో రైతులు, స్త్రీలు, అప్పుృశ్యులు, గిరిజనులు, సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి బహుజన నిర్మాణం ఎలా ఉండాలో శివాజీ పాలన నేటి పాలకులకు ఆదర్శం అని,ఆయన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు.ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి
శివాజీ మాట్లాడుతూ రాజులు పోయారు,రాజ్యాలు విచ్చిన్నమయ్యాయి కాని
శివాజీ లాంటి బహుజన పాలకుడిని కీర్తి ప్రపంచానికి చాటాలన్నారు.వియత్నాం వంటి దేశం ఛత్రపతి స్పూర్తితో యుద్ధంలో విజయం సాధించిందని పేర్కొన్నారు.ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ మాట్లాడుతూ ఓబీసీ కోసం నిరంతరం పోరాడుతున్నామని,ఆ కలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనంతరం బూర్గుల సమ్మయ్య ఇంటిదగ్గర భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలిగే సాంబారావు,విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోటె చిరంజీవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శివాజీ,ప్రధాన కార్యదర్శి కిషన్ రావు,నాయకులు లక్ష్మణ్ రావు,సుకిన సంతాజి,తిరుపతి రావు, దామోదర్,
లింగమూర్తి,కండె రావు,చందర్రావు,భాస్కర్,మరియు ఆరె కుల నాయకులు నేరెళ్ల గ్రామాస్తులు పాల్గొన్నారు.
ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
