భద్రాచలం నేటి దాత్రి
రైతు పండించిన పంట కు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.
రైతును మోసం చేస్తున్న దాలరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
ఆకాలవర్షాలకు తడిసిన పత్తి, వరి, మొక్కజొన్నలు, ఇతరపంటలంన్నిటిని ప్రభుత్వమే msp ధరకే కొనుగోలు చెయ్యాలి.
లేనియెడల రైతులను ఐక్యం చెసి వారి సమస్యల పరిస్కారం కై ఉద్యమిస్తాం.
పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, కల్పనల డిమాండ్.
చర్ల మండల కేంద్రంలోని కామ్రేడ్ డీవీకే భవన్లో శనివారం సి పి ఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ చర్ల మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద బిక్షం మరో జిల్లా నాయకురాలు కల్పన లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన పంటలన్నిటికీ న్యాయమైన కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వమే విస్తృతంగా కొనుగోలు చేయాలని రైతుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఖరీఫ్ పంటలన్నిటికీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఖర్చుల ప్రతిపాదికన కనీస మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో వేగవంతం చేయాలని వారు అన్నారు.వ్యవసాయ మార్కెట్లలో దళారుల అక్రమ దోపిడీని అరికట్టాలని వారు కోరారు. తేమ పేరుతో పంట ధరలు తగ్గించరాదని అకాల వర్షాలకు తడిసిన పత్తి వరి మిర్చి మొక్కజొన్నలు ప్రభుత్వం ఎంఎస్పి ధరలకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంట ఉత్పత్తులు అకాల వర్షాలకు తడవకుండా తార్పాలెన్ లను ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు.ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీని చేయాలని రైతు భరోసా ఖరీఫ్ రబీ కలిపి 15 వేల రూపాయలు రైతు ఖాతాలో వెయ్యాలని దొడ్డు సన్న ధాన్యాలతో పాటు అన్ని పంటలకు 500 బోనస్ చెల్లించాలని పసుపు, మిర్చి, చెరుకుకు, ఎంఎస్పీ ధరలు ప్రకటించాలని అన్నారు. 58 సంవత్సరాలు నిండిన రైతుకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు బీమా పంటల బీమాకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి అమలు చేయాలని ధరణి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు.ఈ సమస్యలన్నీటి పరిష్కారం కై రైతు సంగం ఆధ్వర్యంలో మండలాల్లో, డివిజన్లో, జిల్లా కేంద్రాలలో, కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుందని వారు తెలిపారు.అందులో భాగంగానే అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చర్ల మండల నాయకులు కొండా కౌశిక్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని శనివారం చర్ల స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు సిమిడి సుజాత, సాయన్న, చుక్కన్నా, మండల నాయకులు పూజారి సామ్రాజ్యం, మెహముద, నరసింహ, చెన్నం మోహన్, తదితరులు పాల్గొన్నారు.