వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం..
*భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు..
*హర హర మహాదేవ శంభో శంకర…ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగిన మాడ వీధులు..
శ్రీకాళహస్తి(నేటి ధాత్రి)
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 లో భాగంగా నేడు 7 వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11 30 గంటలకు ప్రారంభం అయింది. స్థానిక ఎమ్మెల్యే, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భక్తిశ్రద్ధలతో హర హర మహా దేవ శంభో శంకర,ఓం నమ: శివాయ నమ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,ఆలయ ఈఓ,ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు..