కాటారం, నేటి ధాత్రి:
గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు అందాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు జీతాల కోసం ఎదురుచూపులే తప్ప తీసుకున్న దారి కనిపించడం లేదని కాటారం గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది తెలిపారు. తమ వేతనాలు ప్రభుత్వం అందిస్తున్న ఆశతో తమ సేవలను నిర్వీర్యంగా కొనసాగిస్తున్నామని , కూలి పనైనా రోజుకు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పనిచేస్తే కూలి వస్తుందని కని తాము ముద్దొస్తమానం విధులు నిర్వహించిన వేతనాలు అందకపోవడంతో కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందని కాటారం గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ఒక కష్టాలు మరణం లేదని వాపోయారు. ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో 353 జాతీయ రహదారిపై రెండు పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు