చందుర్తి, నేటిధాత్రి:
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ.
ప్రజలను చైతన్య పరిచిన గొప్ప వీర నాయకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ. ఆ రోజుల్లో నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సబ్బండ వర్గాలకు స్వేచ్ఛ వాయు లందించి భూస్వాములకు, వారి అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడ్డ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం, తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, బత్తుల కమలాకర్, హమ్మయ్య చారి తదితర నాయకులతోపాటు, రజక సంఘం చందుర్తి మండల శాఖ అధ్యక్షులు సుద్దాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, కోశాధికారి కొడగంటి గంగాధర్, చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి రాములు, లింగంపల్లి బాలయ్య, తిరుపతి, దేవయ్య, కొండయ్య, వెంకటి, మల్లయ్య, రాజయ్య, మహేష్, దేవయ్య, మల్లయ్య, రాములు,శ్రీకాంత్, లచ్చయ్య, కిష్టయ్య, వెంకటి, శంకరయ్య, సుద్దాల రామచంద్రం, బాబు, అలాగే ముడపల్లి రజక సంఘానికి చెందిన గుజ్జుల శంకర్ మరియు చందుర్తి గ్రామ పెద్దలు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.