అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాశెట్టి శ్రీనివాస్ తనుజా రాణి దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
అయ్యప్ప స్వామి భక్తి, శరణాగతి, క్రమశిక్షణ వంటి విలువలు సమాజానికి మార్గదర్శకమని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బట్టు రవి,బిజెపి , జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ జిల్లా ఉపాధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి అర్బన్ మండల్ ప్రధాన కార్యదర్శి కర్వేద మనోహర్ రెడ్డి, నాయకులు కోరి సుధాకర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
