
Chandrababu to Meet Pawan Today
పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వైరల్ ఫీవర్ (Viral fever)తో ఇబ్బంది పడుతున్న పవన్‌ను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌కు వైద్యం అందించారు. వైద్యులకు చూయించిన జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చూయించుకున్నట్లు సమాచారం. ఇంకా జ్వరంతోనే ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.