*సంక్రాంతి వేడుకల్లో నారావారికుటుంబీలతో కలిసిన
జిల్లా తెలుగు దేశంపార్టీ అధ్యక్షులు
షణ్ముగరెడ్డి..
నారావారిపల్లి(నేటిధాత్రి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి కలిసి వారి స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. సీఎం చంద్రబాబు తో పాటు, ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి యువనేత లోకేష్ నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణ మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైనవారికి బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులను అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ,ఏం.ఎల్.సి శ్రీకాంత్, యువ నాయకులు వినీల్ ,పార్టీ ప్రధాన కార్యదర్శి సునీలకుమార్ చౌదరి జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు…
